మహేశ్ బాబు కంటే ఆయన అభిమానులంటే చాలా ఇష్టంః పూరీ జగన్నాథ్

98
Mahesh Babu Puri Jagannath

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ సినిమా తర్వాత వరుసగా ఆరు సినిమాలు ప్లాప్ అయ్యాయి. తాజాగా ఆయన తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈనెల 18న విడుదల అయింది. ఈసినిమా మొదట కొంచెం మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. రామ్ ఇంతకుమందు సినిమాలకు ఈ రేంజ్ లో కలెక్షన్లు ఎప్పుడు రాలేదు.

ఇక తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన్న పూరీ జగన్నాథ్ మహేశ్ బాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటీ అని అడగ్గా జనగణమన అని చెప్పారు. ఈసినిమాను మహేశ్ బాబుతో చేయాలని అనుకుంటున్నానని కానీ నాకు హిట్ లేదు కాబట్టి మహేశ్ నాతో చేయడానికి ఆసక్తి చూపించడం లేదన్నారు. మహేశ్ బాబు ఫ్యాన్స్ రోజు నాకు మెసెజ్ చేస్తారని చెప్పారు. అందుకే నాకు మహేశ్ బాబు కంటే మహేశ్ అభిమానులు అంటే చాలా ఇష్టం అని చెప్పారు.

ఇస్మార్ట్ శంకర్ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి ఫస్ట్ డే రూ.7.83 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా.. ఓవర్సీస్‌తో కలుపుకొని రూ.14 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఇస్మార్ట్ శంకర్. పక్కా మాస్ ఎలిమెంట్ తో తెరకెక్కిన ఈసినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈసినిమాకు మంచి స్పందన రావడంతో పూరీ ఈజ్ బ్యాక్ అంటున్నారు అభిమానులు.