‘ఆర్ఆర్ఆర్’ నుండి ఆలియా అవుట్..?

287
Alia Bhatt

టాలీవుడ్‌ దర్శకదిగ్గజం రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ నటిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపోందుతోంది. ఈ మూవీ ష్యూటింగ్‌ కరోనా వైరస్ కారణంగా ఇటీవల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జంటగా బాలీవుడ్ నటి అలియా భట్ ను ఎంపిక చేశారు. అయితే ఈ చిత్రం నుంచి ఆలియా తప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

rrr

బాలీవుడ్ బిజీ న‌టీమ‌ణుల‌లో అలియా భ‌ట్ ఒక‌రు. ఆమె చేతిలో ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్ర‌తి ప్రాజెక్ట్‌కి ప‌క్కా ప్లానింగ్‌తో డేట్స్ ఇచ్చిన అలియా భ‌ట్‌కి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయ‌డం క‌ష్టతరంగా మారింద‌ట‌. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ్డ పూణే షెడ్యూల్ వ‌చ్చే నెల నుండి జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆ స‌మ‌యంలో అలియా భ‌ట్ అందుబాటులో ఉంటుందా అనేది ప్ర‌శ్న‌గా మారింది. అలియాకి కుద‌ర‌ని ప‌క్షంలో ఆమె స్థానంలో ఎవ‌రిని ఎంపిక చేస్తారో చూడాలి.