చెన్నై టార్గెట్ 179 పరుగులు

227
dhavan
- Advertisement -

ఐపీఎల్-11 ఫైనల్లో ముంబై వేదికగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 178/6 పరుగులు చేసింది. హైదరాబాద్ 179 పరుగుల విజయ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది. సన్ రైజర్స్ ఆటగాళ్లలో కెప్టెన్ విలియమ్సన్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు నమోదు చేసి 47 పరుగుల చేశాడు. చివర్లో వచ్చిన యూసఫ్‌ పఠాన్ దూకుడుగా ఆడి 25 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లు బాది 45 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచాడు. శిఖర్‌ ధావన్‌(26; 25 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌), షకిబుల్‌ హసన్‌(23; 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు. బ్రాత్‌వైట్‌(21;11 బంతుల్లో 3 సిక్సర్లు) పరుగులు చేశాడు.

మొదటగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ 13 పరుగుల వద్దనే శ్రీవాత్సవ్ గోస్వామి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. అనంతరం విలియమ్సన్ ధానన్ తో చెలరేగుతున్న సమయంలో ధావన్ ఔట్ అయ్యాడు. 51 పరుగుల భాగస్వామం వద్ద జడేజా వీళ్లిదరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. భారీ షాట్ ఆడ బోయిన ధావన్ ఔట్ అయ్యాడు.

తర్వాత వచ్చిన షకీబుల్ లతో కలిసి విలియమ్సన్ భారీ స్కోర్ దిశగా వెళ్తున్న తరుణంలో విలియమ్సన్ ఔట్ అయ్యాడు. వెంటనే షికిబుల్ హసన్, దీపక్ హుడాలు కూడా వెనుదిరిగారు. అనంతరం వచ్చిన యూసఫ్ పఠాన్ ఆదుకోవడంతో 178 పరుగులు చేసింది. ఇక చెన్నై బౌలర్లలో ఎన్‌గిడి, కరణ్‌ శర్మ, బ్రేవో, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌లు తలో వికెట్‌ తీశారు.

- Advertisement -