నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం..

1078
mans day
- Advertisement -

నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజు వస్తుందో ఆడా మగా అందరికీ తెలుసు గానీ, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎప్పుడొస్తుందనేది చాలామంది పురుషులకు కూడా తెలీదు. అయితే ఈ దినోత్సవాన్ని నవంబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మన దేశంలో ఈ ఉత్సవాన్ని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ అధ్వర్యంలో దేశమంతా జరుపుకుంటున్నారు.

ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం మగవాళ్ళు, మగ పిల్లల అనారోగ్య సమస్యలపై దృష్టి సారించడం, లింగ వివక్ష లేని సమాజాన్ని సాధించటం, నానాటికీ తగ్గిపోతున్న మానవ విలువల్ని పెంచడం, స్త్రీ-పురుషుల మధ్య సానుకూల దృక్పథాన్ని పెంపొందించటం వంటివి ప్రధాన ఉద్దేశాలు.

మన సమాజంలో ప్రతి మగాడూ, కర్షకుడిగా, కార్మికుడిగా, సైనికుడిగా, శ్రామికుడిగా, టీచర్‌గా, డాక్టర్‌గా, ఇంజినీర్‌గా, రాజకీయ నేతగా, సేవకుడిగా ఇలా ఎన్నో మార్గాల్లో సమాజ నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. వారి సేవల్ని స్మరించే అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఆ అవకాశం కల్పిస్తోంది. మానవ సమాజ నిర్మాణంలో ఎంతో మంది మహా పురుషులు తమ జీవితాల్ని, సర్వస్వాన్నీ త్యాగం చేశారు. వారి త్యాగాల్ని ఈ రోజు మనం స్మరించుకొని, స్ఫూర్తి పొందుదాం.

International Men’s Day is celebrated on 9 November every year to raise awareness about the issues that men’s generally faces and to improve …

- Advertisement -