పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభమైన కైట్, స్వీట్ ఫెస్టివల్

422
kite Festival
- Advertisement -

సికింద్రబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నేడు ప్రారంభమైంది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఫెస్టివల్‌ జరుగుతుందని నిర్వహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పతంగులు, మిఠాయిల ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కైట్ ఫెస్టివల్ పాల్గొనడానికి దేవ విదేశాల నుంచి పలువురు ప్రతినిధులు వచ్చారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు కార్యక్రమాలతో ఫెస్టివల్‌కు వచ్చేవారిని అలరించనున్నారు.

200 వినూత్న ఆకారాలతో గాలిపటాలు పరేడ్‌ గ్రౌండ్‌లో ఎగరనున్నాయి. 1000 రకాల మిఠాయిలు స్వీట్‌ ఫెస్టివల్‌లో ఆస్వాదించవచ్చు.. మరోవైపు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అధికారులు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల ఉట్టిపడేలా అంతర్జాతీయ స్థాయి కైట్ మరియు స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దాదాపుగా 25 రాష్ట్రాలనుండి వారి సంస్కృతి, కళల ప్రదర్శన ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

- Advertisement -