‘భారత్’ సినిమా చూసిన భారత జట్టు..!

160
Bharat Movie

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లు కాసేపు సేదతీరేందుకు ‘భారత్’ సినిమాను చూశారు. సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోనీ, హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌ తదితరులు నాట్టింగ్‌హామ్‌లోని ఓ థియేటర్‌లో మంగళవారం ‘భారత్‌’ మూవీ చూశారు.

స‌ల్మాన్‌కి వీరాభిమాని అయిన జాద‌వ్ థియేట‌ర్‌లో భార‌త్ టీం దిగిన ఫోటోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి భార‌త్ సినిమా చూసిన త‌ర్వాత భార‌త జ‌ట్టుతో అని క్యాప్ష‌న్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్‌పై బాలీవుడ్‌ కండల వీరుడు స‌ల్మాన్ కూడా స్పందించాడు. భార‌త్ సినిమాని చూసినందుకు భార‌త్ టీంకి ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఇంగ్లండ్‌లో భార‌త్ సినిమా చూసినందుకు మీ అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. రానున్న మ్యాచ్‌ల‌లో మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. భార‌తీయులు అంద‌రు మీకు స‌పోర్ట్‌గా ఉన్నారు అని త‌న ట్వీట్‌లో తెలిపాడు స‌ల్మాన్.

ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో భాగంగా టీమిండియా ఇప్పటివరకు రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. గురువారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ గురువారం మ‌ధ్యాహ్నాం 3 గంట‌ల‌కి ప్రారంభం కానుంది. అలాగే ఆదివారం దాయాదుల‌తో పోరుకి సిద్ధం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం  క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.