న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం

191
india Won

వరుస విజయాలతో జోరు మీదున్న టీంఇండియా మరో విజయన్ని సాధించింది. న్యూజిలాండ్ తో 5టీ20ల్లో భాగంగా ఇవాళ మొదటి మ్యాచ్ జరిగింది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 6వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన ఇండియా ఫిల్డింగ్ ను ఎంచుకుంది. న్యూజిలాండ్ ఆటగాళ్లు నిర్ణిత 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 203పరుగులు చేశారు. ఒపెనర్ మార్టిన్ గప్టిల్ 19బంతుల్లో 30పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ మునారో కోలిన్ 42బంతుల్లో 59పరుగులు చేశాడు.

న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ 26బంతుల్లో 51పరుగులు చేశాడు. మరో ఆటగాడు రాస్ టేలర్ 27బంతుల్లో 54 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక 204పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీంఇండియా కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ 7పరుగులకే అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ రాహుల్ రెచ్చిపోయాడు. 27బంతుల్లో 56పరుగులు చేసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి 32బంతుల్లో 45పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శ్రేషన్ అయ్యర్ కేవలం 29బంతుల్లో 58పరుగులు చేసి ఇండియాను గెలిపించాడు. రెండో టి20 మ్యాచ్ ఇదే మైదానంలో జనవరి 26 ఆదివారం జరగనుంది.