రెండో వ‌న్డేలో భార‌త్ ఘ‌న విజ‌యం..

78
virat

న్యూజిలాండ్ తో జరిగిన రెండో వ‌న్డేలో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. 325 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య కివీస్ జట్టు 234 పరుగులకే ఆలౌట్ అయింది. 40.2 ఓవర్లలోనే 234 పరుగులకు కివీస్ ఆలౌల్ అయింది. దీంతో భారత్ 90 పరుగుల తేడాతో భార‌త్ భారీ విజ‌యాన్ని సాధించింది. భార‌త బౌల‌ర్ కుల్దీప్ యాద‌వ్ 4వీకెట్లు తీసి కివీస్ ఆట‌గాళ్లకు చుక్క‌లు చూపించాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ 50ఓవ‌ర్ల‌లో 324ప‌రుగులు చేసి 4వికెట్లు కోల్పోయింది.

రోహిత్ శ‌ర్మ 87, ధావ‌న్ 66, కోహ్లీ 43, అంబ‌టి రాయుడు 47, ధోని 48, జాధ‌వ్ 22 ప‌రుగులు చేశారు. భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కివీస్ ప్రారంభంలోనే తడబడింది. 146 పరుగులకే మొదటి ఆరు కీలక వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ ఓటమి దాదాపు ఖాయమైపోయింది. 87 పరుగులతో రాణించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఐదు వన్డేల సిరీస్ లో మొదటి రెండు మ్యాచుల్లో విజయం సాధించిన టీంఇండియా 0-2 తేడాతో ఆధిక్యంలోకి ఉంది.