రోహిత్ ,రాహుల్ సెంచరీ..ఇండియా ఘన విజయం

110
Rohit Sharma

వరల్డ్ కప్ లో భాగంగా నిన్న శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. దీంతో ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత 50ఓవర్లలో 265పరుగులు చేసింది. మాథ్యూస్‌ 113 పరుగులు చేయగా, తిరుమానె 53 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. పాండ్యా, కుల్దీప్‌, జడేజా, భువనేశ్వర్‌లు చెరో వికెట్‌ తీశారు.

266పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీంఇండియాకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ సెంచరీ చేసి రికార్డు నెలకొల్పారు. వరల్డ్ కప్ లో ఇద్దరు భారత ఓపెనర్లు ఒకే మ్యాచ్ లో సెంచరీలు నమోదు చేయడం ఇదే తొలిసారి. ఈ విజయంతో టీమిండియా ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తం లీగ్ మ్యాచ్ లన్నీ పూర్తికాగా భారత్ 9 మ్యాచ్ ల్లో 15 పాయింట్లతో నంబర్ వన్ ప్లేసులో ఉంది.

ఇక తర్వాత మ్యాచ్ సెమిస్ ఉండటంతో తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం టీంఇండియా పాయింట్ల పట్టికలో నెం1స్ధానంలో ఉంది. అగ్రస్థానంలో ఉన్న భారత్ కు, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ సెమీస్ ప్రత్యర్థి అవుతుంది. అదే జరిగితే, రెండు, మూడు స్థానాల్లో ఉండే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరో సెమీఫైనల్లో తలపడతాయి.