షమీ హ్యాట్రిక్ …ఆఫ్గాన్ పై ఇండియా గెలుపు

114
shami-hat-trick

వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఆఫ్గనిస్తాన్ పై విజయం సాధించింది ఇండియా. ఉద్రిక్తంగా సాగిన ఈ మ్యాచ్ లో 11పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా నిర్ణిత 50ఓవర్లలో 225పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్క పరుగుకే అవుట్ కావడంతో టీంఇండియాకు మొదట్లోనే షాక్ తగిలింది. లోకేష్ రాహుల్ 50బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి 67 పరుగులు చేసి మ్యాచ్ కు పెద్ద దిక్కుగా నిలిచాడు. కేదార్ జాదవ్ 52పరుగులు చేసి చివర్లో టీంఇండియాను ఆదుకున్నాడు. ఇక 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్ జట్టుకు కూడా ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది .. అ జట్టు ఓపెనర్ హజ్రతుల్లా (10) వెంటనే అవుట్ అయ్యాడు .

కానీ అ తర్వాత వచ్చిన గుల్బదిన్‌, రహమత్‌ షా మాత్రం భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా తయారయ్యారు . ఇక చివరి ఓవర్ వరకు ఉత్కంటగా సాగిన మ్యాచ్ లో షమీ హ్యట్రిక్ సాధించి ఇండియాకి విజయాన్ని కట్టబెట్టాడు .. వరుసగా నబీ , అఫ్తాబ్‌ , ముజీబ్‌ లను వెనుకకి పంపించడంతో ఇండియా ఇంకొక బాల్ ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది