తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 308/4..

264
- Advertisement -

ఉప్పల్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా ముందు విండీస్ మరోసారి పసికూనగానే మిగిలింది. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విరుచుకుపడటంతో 311 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. పేసర్‌ ఉమేశ్‌ యాదవ్ ఆరు కీలక వికెట్లు తీసి విండీస్‌ను దెబ్బకొట్టాడు. శుక్రవారం నాటి మ్యాచ్‌ విశ్వాసంతో బరిలోకి దిగిన విండీస్‌ బ్యాట్స్‌మెన్స్‌ను భారత బౌలర్లు వరుసగా పెవిలియన్‌కు పంపారు. తొలిరోజు ఆటముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసిన విండీస్ రెండోరోజు కేవలం 16 పరుగులు మాత్రమే చేయగలిగింది.

India vs West Indies

ఇక రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి గాను 308 పరుగులు చేసింది. ఆజింక్యా రహానే (75, 174 బంతులు, 6 ఫోర్లు), రిషబ్ పంత్ (85, 120 బంతులు, 10 ఫోర్లు, 2 సిక్సర్లు)లు క్రీజులో ఉన్నారు. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్‌కు 2 వికెట్లు దక్కగా, గాబ్రియెల్, వారికన్‌లకు చెరో వికెట్ దక్కింది. కాగా భారత్ వెస్టిండీస్ కన్నా ఇంకా 3 పరుగులు వెనకబడి ఉంది. 2వ రోజు 295 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ 101.4 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 6 వికెట్లు తీయగా, కుల్‌దీప్ యాదవ్‌కు 3, అశ్విన్ 1 వికెట్ దక్కాయి.

- Advertisement -