నేడే భారత్, వెస్టిండీస్ నాలుగో వన్డే

10
kohli

భారత్-వెస్టిండీస్‌ మధ్య ముంబై వేదికగా నాలుగో వన్డే ఇవాళ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో గెలవాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుండటంతో ఇరుజట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

మరోసారి బౌలింగ్‌నే నమ్ముకుని కరీబియన్ జట్టు బరిలోకి దిగనుండగా భారత్ బ్యాటింగ్‌పైనే భారం వేసింది. కెప్టెన్‌ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నా.. మిడిలాడర్ సమస్యతో సతమతమవుతున్న భారత్ ఎలాగైనా ఈ సమస్య నుంచి గట్టెక్కి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.

ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచులో రిషబ్ పంత్‌ను పక్కనే పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్ కోహ్లి (కెప్టెన్), అంబటి రాయుడు, రిషబ్‌ పంత్‌/కేదార్‌ జాదవ్‌, ధోని (వికెట్ కీపర్), జడేజా, భువనేశ్వర్‌, చాహల్‌, కుల్‌దీప్‌, జస్‌ప్రీత్ బుమ్రా

వెస్టిండీస్‌: చందర్‌పాల్‌ హేమ్‌రాజ్‌, కీరన్‌ పావెల్‌, షై హోప్‌ (వికెట్ కీపర్), హెట్‌మెయర్‌, శామ్యూల్స్‌, రోమన్‌ పావెల్‌, జేసన్ హోల్డర్‌ (కెప్టెన్), ఫాబియన్‌ అలెన్‌, ఆష్లే నర్స్‌, మెకాయ్‌, రోచ్‌