కోహ్లీ సెంచరీ..వన్డే సిరీస్‌ నెగ్గిన భారత్

295
india vs west indies

ప్రపంచకప్ తర్వాత భారత్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. విండీస్‌తో టీ 20 సిరీస్ నెగ్గిన భారత్..తాజాగా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మూడో వన్డేలో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 241 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. రెండో వన్డేలో సెంచరీ చేసిన కోహ్లీ…మూడో వన్డేలోనూ అదే జోరును కంటిన్యూ చేశారు. ఓపెనర్ రోహిత్ నిరాశ పర్చిన కోహ్లీ మాత్రం తన బ్యాట్‌కు పనిచెప్పాడు. కోహ్లీ (114 నాటౌట్) ,శ్రేయాస్ అయ్యర్ (65) ,ధావన్ (36) పరుగులు చేశారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్స్ క్రిస్‌గేల్ (72: 41 బంతుల్లో 8×4, 5×6), ఎవిన్ లావిస్ (43: 29 బంతుల్లో 5×4, 3×6) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు.

వన్డే సిరీస్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ సిరీస్, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌లు లభించాయి . ఈ నెల 22 నుంచి వెస్టీండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది.