దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..

314
team india

ఐపీఎల్ తాజా సీజన్ కు ముందు భారత పురుషుల జట్టు దక్షిణాఫ్రికాతో మూడు వన్డే మ్యాచ్ లు ఆడనుంది. మార్చి 12 నుంచి 18వ తేదీ వరకు భారత్ లోని పలు వేదికల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. తాజాగా ఈ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తాడు. ఇక, దక్షిణాఫ్రికా జట్టు ఈ సిరీస్ కోసం నేడు భారత్ బయల్దేరింది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే మార్చి 12న ధర్మశాలలో, రెండో వన్డే మార్చి 15న లక్నోలో, చివరిదైన మూడో వన్డే మార్చి 18న కోల్ కతాలో జరగనున్నాయి.

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మనీశ్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, బుమ్రా, నవదీప్‌ సైనీ, కుల్దీప్‌ యాదవ్‌, శుభమన్‌ గిల్‌