శ్రేయాస్ సెంచరీ..కీవిస్ టార్గెట్ 348

226
lokesh rahul

 టీ20 సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించిన టీమిండియా వన్డే సిరీస్‌ను కూడా గెలిచి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా హామిల్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారీ స్కోరు సాధించింది. శ్రేయాస్,లోకేష్ రాహుల్ రాణించడంతో భారత్ 50 ఓవర్లలో4 వికెట్లు కొల్పోయి 347 పరుగులు చేసి 348 పరుగుల టార్గెట్ ను విధించింది.

తొలుత టాస్ గెలిచిన కీవిస్..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక కెప్టెన్ విరాట్ చెప్పినట్లుగానే బ్యాటింగ్ ఆర్డర్లో భారీ మార్పులు చేసింది. ఓపెనర్లుగా పృథ్వీషా,మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.

షా 20 పరుగులు చేసి వెనుదిరగగా…మయాంక్ 32 పరుగులు చేశాడు. వీరిద్దరు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ,శ్రేయాస్ అయ్యర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. కోహ్లీ 51 పరుగులు చేయగా శ్రేయాస్ సెంచరీతో రాణించాడు.

107 బంతుల్లో 103 పరుగులు చేసి శ్రేయాస్ ఔటైన మరో బ్యాట్స్‌మెన్ లోకేష్ రాహుల్ సూపర్బ్ ఇన్నింగ్స్‌  6 సిక్సర్లతో 88 పరుగులతో ఆకట్టుకోగా కేదార్ జాదవ్ 25 పరుగులు చేశాడు.  కీవిస్ బౌలర్లలో సౌథి 2,నిషామ్,సోధి తలో వికెట్ తీశారు.

ఇక ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు అరంగేట్రం చేయడం భారత్‌ క్రికెట్‌ చరిత్రలో ఇది నాలుగోసారి కావడం విశేషం.