ఓటమి దిశగా కోహ్లీ సేన..

190
cook
- Advertisement -

ఇప్పటికే సిరీస్ కొల్పోయి ఇంటా,బయటా విమర్శలను ఎదుర్కొంటున్న కోహ్లీ సేన తాజాగా మరో పరాజయానికి అడుగుదూరంలో నిలిచింది. 464 పరుగుల భారీ ఛేదనలో తడబాటుపడింది. 2 పరుగులకే 3 వికెట్లు కొల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఓపెనర్‌ కేఎస్ రాహుల్(46),రహానే(10) క్రీజులో ఉన్నారు. చివరి రోజు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ ఓటమి ఖాయం. నాలుగోరోజు ఆటముగిసే సమయానికి 58 పరుగులు చేసింది.

సిరీస్‌లో వైఫల్యాలను కొనసాగిస్తూ ధావన్ మరోసారి నిరాశపర్చాడు. అండర్సన్ బౌలింగ్‌లో ధావన్‌,పుజారా వెంటవెంటనే వెనుదిరిగారు. తర్వాత బ్రాడ్ సందించిన అద్భుత ఔట్‌స్వింగర్‌కు కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత మరోవికెట్ పడకుండా ఓపెనర్ రాహుల్,రహానే జాగ్రత్తగా ఆడారు. నాలుగో వికెట్‌కు 55 పరుగులు జతచేశారు.

అంతకముందు ఓవర్‌నైట్‌ స్కోరు 114/2తో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్‌కు కుక్,రూట్ మంచి శుభారంభాన్నందించారు. అలిస్టర్‌ కుక్‌ (147; 286 బంతుల్లో 14×4),రూట్‌ (125; 190 బంతుల్లో 12×4, 1×6) శతకాలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కుక్‌-రూట్‌లు మూడోవికెట్‌కు 259 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. స్టోక్స్‌ (37), కరన్‌ (21), రషీద్‌ (20 నాటౌట్‌) ధాటిగా ఆడడంతో ఇంగ్లాండ్‌ 423/8 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

- Advertisement -