భారత జైత్రయాత్రకు బ్రేక్‌..

497
india vs england
- Advertisement -

ప్రపంచకప్‌లో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ చేతిలో భారత్ మట్టికరించింది. బ్యాటింగ్,బౌలింగ్‌ అన్ని రంగాల్లో రాణించిన ఇంగ్లండ్‌ 31 పరుగుల తేడాతో భారత్‌పై గెలుపొందింది. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేనకు ఆరంభంలోనే గట్టి షాక్‌ తగిలింది. ఓపెనర్‌ లోకేష్ రాహుల్ 9బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. అయితే.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం సెంచరీతో అదరగొట్టాడు. 109బంతుల్లో 102 పరుగులు చేసి మరోసారి సత్తాచాటాడు.

విరాట్ కోహ్లీ 66, హార్థిక్ పాండ్యా 45, ధోనీ 42(నాటౌట్), రిషబ్ పంత్ 32(29) పరుగులతో రాణించినప్పటికీ టీమిండియా విజయ తీరాలను చేరుకోలేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో లియమ్ ప్లంకెట్ 3 వికెట్లు, క్రిస్ వోక్స్ 2 వికెట్లు దక్కించుకున్నారు.

అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు రాయ్, బెయిర్‌స్టో 160 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. జాసన్ రాయ్ 57 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 66 పరుగులు చేశాడు. బెయిర్‌స్టో (111), స్టోక్స్‌ ( 79) అర్ధసెంచరీతో రాణించడంతో ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 337 పరుగులు చేసింది. 1992 తర్వాత ప్రపంచకప్‌లో తొలిసారి ఇంగ్లండ్‌ జట్టు భారత్‌ను ఓడించింది.

- Advertisement -