3వ వన్డే.. భారత్ లక్ష్యం 287పరుగులు

212
india_vs_australia

బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియా ఇండియా మధ్య మూడో టీ20 జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణిత 20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 286పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ స్టీవ్‌ స్మిత్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. 132 బంతుల్లో 131పరుగులు చేసిన అవుట్ అయ్యాడు.

మిడిలార్డర్‌ లబుషేన్‌ అర్ధసెంచరీ(54)తో ఆకట్టుకున్నాడు. కాగా, స్మిత్‌కు ఇది వన్డేల్లో 9వ సెంచరీ కాగా, భారత్‌పై 3వ సెంచరీ. ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ అత్యధికంగా నాలుగు వికెట్లను తీశాడు. ఆతర్వాత రవీంద్ర జడేజ 2, నవదీప్ సైని 1, కుల్దిప్ జాదవ్ 1ను సొంతం చేసుకున్నారు. కాగా తొలి వన్డే ఆస్ట్రేలియా గెలవగా, రెండవ వన్డే ఇండియా గెలిచింది. దీంతో మూడవ వన్డే ఎవరు గెలుస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ వన్డే ఎవరు గెలిస్తే వారు సిరీస్ కైవసం చేసుకోనున్నారు.