భారత్ ఆసీస్ ఐదో వన్డే..సిరీస్ ఎవరి సొంతం?

245
virat
- Advertisement -

దిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానంలో భారత్ -ఆసీస్ మధ్య నేడు చివరి వన్డే జరుగనుంది. 5 వన్డేలలో ప్రస్తుతం ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్ లలో విజయం సాధించాయి. ఇవాళ జరిగే చివరి వన్డేపై ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు ఉండనుంది. ఈమ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారికే సిరీస్ కైవసం కానుంది. మొదటి రెండు మ్యాచ్ లను సునాయసంగా గెలిచిన భారత్ ఆ తరువాత రెండు మ్యాచ్ లను చేతులారా చేజార్చుకుంది. ఇక నాలుగో వన్డేలో మాత్రం ఇండియా పక్కాగా విజయం సాధిస్తుందనుకున్నారు క్రికెట్ అభిమానులు. ఆస్ట్రేలియాకు భారీ లక్ష్యాన్ని ఇచ్చిన ఫలితం లేకుండా పోయింది. బౌలర్లు, ఫిల్డిండ్ విఫలం వల్ల నాలుగో వన్డే ఓడిపోవడం జరిగింది. ఇక గత మ్యాచ్ లో ధోని కి రెస్ట్ ఇవ్వడంతో ఆయన స్ధానంలో యువ కీపర్ రిషబ్ పంత్ ను తీసుకున్నారు.

రిషబ్ బ్యాటింగ్ లో పరవాలేదనిపించినా కీపింగ్ లో మాత్రం చాలా తప్పదాలు చేశాడు. ముఖ్యంగా టర్నర్ కొట్టిన తీరుకు కనీసం బంతుల్లో మార్పు చేయాలన్న ధ్యాస కూడా టీమ్‌ఇండియా బౌలింగ్ బృందానికి గుర్తుకురాలేదు.మ్యాచ్ కీలక దశలో ఆయన వరుసగా మూడు నాలుగు స్టంప్ లను మిస్ చేశాడు. దీంతో పంత్ పై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఇక నేడు జరిగే మ్యచ్ లో సొంత గడ్డపై పంత్ ఏవిధంగా ఆడతాడో చూడాలి. అటు బౌలింగ్ ఇటు కీపింగ్ , ఫిల్డిండ్ లో పూర్తిగా విఫలం చెందడంతో ధోని లేని లోటు తీవ్రంగా కనిపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక మిడిల్ ఆర్డర్ అంబటి రాయుడు ప్లేస్ లో నాలుగో వన్డేలో కేఎల్ రాహుల్ ఎంట్రీ ఇచ్చాడు. అతడు కూడా పెద్దగా పరుగులు చేయలేదు. ఈమరి ఐదో వన్డేలో రాయుడుని తీసుకుంటారా లేదా రాహుల్ నే కంటిన్యూ చేస్తారో చూడాలి. మరోవైపు నాలుగో వన్డేలో భారీ స్కోరును ఛేదించిన ఆసీస్ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఎలాగైనా చివరి వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సిరీస్ ఎవరి సొంత కానుందో తెలియాలంటే రాత్రి వరకూ వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -