భారత్‌, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ రద్దేనా..?

418
virat kohli
- Advertisement -

రాజ్‌ కోట్ లో బుధవారం జరిగే భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌ పై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ ను నిర్వహించాలా లేక రద్దు చేయాలా అనే సందేహాంలో పడింది  బీసిసిఐ. ఈ సందిగ్ధం ఒక్క టెస్ట్ మ్యాచ్‌ కే కాదు మొత్తం ఇంగ్లాండ్ టూర్‌నే రద్దు చేసే సూచనలు కనబడుతున్నాయి. దీనికి కారణం,, బీసిసిఐ లో జరుగుతున్న అవకతవకలను ప్రక్షాళన చేసేందుకు,,కేంద్ర ప్రభుత్వం లోథా కమిటీ వేసింది. ఈ కమిటీ బీసిసిఐ జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు కొన్ని సూచనలను సిఫార్సు చేసింది. దీనికి బీసిసిఐ ససేమిరా అంది. దీంతో తాము నివేధించిన సూచలను అమలు పరిచే వరకు,,రాష్ట్ర్రాల క్రికెట్ బోర్డులకు నిధులు మంజురు చేయవద్దని,,స్పష్టం చేసింది. దీనిని సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది.

lodha-anurag-thakur
కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు నిధులను విడుదల చేసే విషయంలో తమకు వెసులుబాటు లేనందున రేపటి నుంచి జరగాల్సిన భారత్ – ఇంగ్లండ్ మ్యాచ్ ను రద్దు చేయక తప్పేట్టు లేదని బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా) స్పష్టం చేసింది. తాము డబ్బులు పంపించకుంటే, మ్యాచ్ నిర్వహణ క్లిష్టతరం అవుతుందని, ఈ పరిస్థితుల్లో మ్యాచ్ రద్దు మినహా మరో మార్గం లేదని సుప్రీంకోర్టుకు ఈ ఉదయం బీసీసీఐ అఫిడవిట్ ను సమర్పించింది. నిధులు విడుదల చేసేందుకు అంగీకరించాలని కోరింది. ప్రస్తుతం కోర్టు బీసీసీఐ అఫిడవిట్ ను పరిశీలిస్తోంది. లోథా కమిటీ నివేధిక దృష్ట్య బీసిసిఐకు నిధులను బదిలీ చేసే వేసులుబాటు లేకపోవడంతో,,ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ప్రయాణ, హోటల్, ఆతిథ్య తదితర ఖర్చులను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డే భరించుకోవాలని బీసీసీఐ కోరింది.

lodha-anurag-thakur

దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ కాస్తంత ఘాటుగానే స్పందించింది. క్రికెట్ పోటీల నిమిత్తం తాము పర్యటనకు వస్తే, ఖర్చులన్నీ తమనే భరించుకోవాలని చెప్పడం భావ్యం కాదని, మ్యాచ్ నిర్వహణపైనే నీలినీడలు కమ్మే వ్యాఖ్యలు చేస్తున్నారని ఈసీబీ ఆరోపించింది. ఇప్పటికే రాజ్ కోటకు చేరుకుని తమ ఖర్చుతో హోటల్ లో ఉంటున్న ఇంగ్లండ్ ఆటగాళ్లకు, అసలు మ్యాచ్ ఉంటుందా? ఉండదా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలని అల్టిమేట్టం ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఈ విషయంలో బీసీసీఐ అఫిడవిట్ ను సుప్రీంకోర్టు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. బీసిసిఐకు నిధుల వెసులుబాటు కల్పించే విషయంపై సుప్రీం తీర్పుపైనే,,ఇంగ్లాండ్‌ తో జరిగే మ్యాచ్ భవితవ్యం ఆధారపడి ఉంది.

virat

- Advertisement -