నేడు ఇండియా న్యూజిలాండ్ 3వ వన్డే

228
india newzeland

టీంఇండియా న్యూజిలాండ్ పర్యటనలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ తో 5 టీ20ల సిరీస్ లో భాగంగా నేడు మూడో టీ20 జరుగనుంది. హామిల్టన్ వేదికగా జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌ మధ్యాహ్నం 12.30కి ప్రారంభంకానుంది. 5టీ20ల్లో భాగంగా ఇప్పటికే ఇండియా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ గనుక ఇండియా విజయం సాధిస్తే తొలి సారి కివీస్ గడ్డపై సిరీస్ గెలుచుకోనుంది. ‌

ఈ మ్యాచ్ గెలవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అటు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కివీస్ భావిస్తోంది. ఇక ఇండియా బ్యాటింగ్ , బౌలింగ్ లో అద్భతుమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. మిడిల్ అర్డర్ బ్యాట్స్ మెన్లు శ్రేయస్ అయ్యర్, మనిష్ పాండేలు అద్భుతంగా ఆడుతున్నారు. ఒపేనర్ కేఎల్ రాహుల్ భీకరమైన ఫాంలో ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లో ఆఫ్ సెంచరీ చేస్తూ సత్తా చాటుతున్నాడు.