వరుసగా 11 సిరీస్‌…తిరుగులేని కోహ్లీసేన

325
team india

టెస్టులో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 11వ సిరీస్‌ను గెలిచి కోహ్లీసేన భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రాంచీటెస్టులో గెలిచి సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసింది. ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. విజయానికి కావాల్సిన రెండు వికెట్ల‌ను న‌దీమ్ ఇ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌట్‌ అయిన సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే చాపచుట్టేశారు. ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 497 ర‌న్స్ చేసిన విష‌యం తెలిసిందే.

హోమ్ సిరీస్‌ను వ‌రుస‌గా గెల‌వ‌డం ఇది 11వ సారి కావ‌డం విశేషం. 2012-13లో చివ‌రిసారి ఇంగ్లండ్ చేతిలో హోమ్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన భారత్‌కు ఇప్పటివరకు ఎదురులేకుండా పోయింది.