అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌..

266
- Advertisement -

అండర్‌-19 ప్రపంచకప్‌లో యువభారత్‌ మరోసారి అదరగొట్టింది. సెమీఫైనల్లో పాక్‌ను 203 పరుగులతో చిత్తుగా ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ కేవలం 69 పరుగులకే కుప్పకూలింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌… శనివారం జరగనున్న తుదిపోరులో ఆస్ర్టేలియాతో తలపడనుంది. భారత్‌పై ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి. ప్రపంచకప్‌ను చెరో మూడుసార్లు గెలుచుకుని సమవుజ్జీలుగా ఉన్న భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్‌ జరగనుండటంతో తుదిపోరు మరింత ఆసక్తి కలిగించడం ఖాయం.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌.. శుభ్‌మన్ గిల్ అజేయ శతకంతో పాటు బ్యాట్స్‌మన్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ పృథ్వీషా(41), మంజోత్(47) జట్టుకు శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 89 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఐదు పరుగుల వ్యవధిలో వీరిద్దరూ అవుటడంతో పాటు, వికెట్ కీపర్ దేశాయ్(20), రియాన్ పరాగ్(2), అభిషేక్ శర్మ(5) కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాల్లో పడింది.

India beats Pakistan by 203 runs in U-19 WC
ఈ క్రమంలో వన్ డౌన్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్-అనుకుల్ రాయ్ జోడీ జట్టును ఆదుకుంది. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా ఆడి జట్టు స్కోరును200 దాటించారు. అయితే రాయ్ 33 పరుగులు చేసి అవుటయ్యాడు. గిల్ సెంచరీ చేరువైన సమయంలో టెయిలెండర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. దీంతో ఆఖర్లో తీవ్ర ఉత్కఠ నెలకొంది. చివరి బంతికి ఒక పరుగు చేస్తే సెంచరీ పూర్తవుతుందనగా పాక్ బౌలర్ నోబాల్ వేశాడు. ఆ బంతికి రెండు పరుగులు చేసిన గిల్ సెంచరీ పూర్తి చేశాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ మూసా నాలుగు, అర్షద్ ఇక్భాల్ మూడు, అఫ్రిదీ ఒక వికెట్ పడగొట్టారు.

India beats Pakistan by 203 runs in U-19 WC
స్కోరు బోర్డు

అండర్‌-19 భారత్‌ ఇన్నింగ్స్‌:
1. పృథ్వీ షా – 41(42; 3×4, 1×6)
2. మన్‌జోత్‌ కల్రా – 47(59; 7×4)
3. శుభ్‌మన్‌ గిల్‌ – 102నాటౌట్‌ (94; 7×4)
4. దేశాయ్‌ – 20(34; 1×4)
5. పరాగ్‌ – 2(5)
6. అభిషేక్‌ శర్మ – 5(9)
7. ఏఎస్‌ రాయ్‌ – 33(45; 4×4)
8. నాగర్‌కోటి – 1(6)
9. శివమ్‌ మావి – 10(6; 2×4)
10. శివ సింగ్‌ – 1(2)
11. పోరెల్‌ – 1నాటౌట్‌(1)
ఎక్స్‌ట్రాలు: 9(నోబాల్‌ 3, వైడ్‌ 6)
మొత్తం(50ఓవర్లలో) 272/9

అండర్‌-19 పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌‌:
1. ఇమ్రాన్‌ షా – 2(14)
2. మహమ్మద్‌ జైద్‌ ఆలమ్‌ – 7(10; 1×4)
3. రోహలీ నజీర్‌ – 18(39)
4. అలీ జరియబ్‌ ఆసిఫ్‌ – 1(9)
5. అమ్మద్‌ అలమ్‌ – 4(15; 1×4)
6. మహమ్మద్‌ తాహా – 4(23)
7. షాద్‌ ఖాన్‌ – 15(33, 1×4)
8. హసన్‌ ఖాన్‌ – 1(5)
9. షాహీన్‌ షా ఆఫ్రిది – 0(11)
10. ముహమ్మద్‌ ముసా – 11నాటౌట్ ‌(14; 1×4, 1×6)
11. ఆర్షద్‌ ఇక్బాల్‌ – 1(4)
ఎక్స్‌ట్రాలు: 5(నోబాల్‌ 2, వైడ్‌ 3)
మొత్తం(29.3ఓవర్లలో)- 69ఆలౌట్‌

- Advertisement -