2019ని ఘనంగా ముగించిన కోహ్లీసేన

353
ind vs wi

కటక్ వన్డేలో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన 316 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని 48.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని కైవసం చేసుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1తో భారత్ కైవసం చేసుకోగా వెస్టిండీస్ పై భారత్ వరుసగా పదో సిరీస్‌.గత దశాబ్దకాలంలో ఒక్కసారి కూడా భారత్ గడ్డపై విండీస్ వన్డే సిరీస్ గెలవలేదు.

విండీస్ విధించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. రాహుల్ (77), రోహిత్ శర్మ (63) రాణించారు. వీరికి తోడు విరాట్ కోహ్లీ (85) నిలకడగా రాణించడంతో మరో 8 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

అంతకముందు టాస్ గెలిచిన భారత్‌…విండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నికోలస్ పూరన్ (89), కెప్టెన్ కీరన్ పొలార్డ్ (74 నాటౌట్ 51 బంతుల్లో 3×4, 7×6) దూకుడుగా ఆడటంతో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది.