సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

328
Junior Doctors Strike
- Advertisement -

తెలంగాణలో గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ఇవాళ   విరమించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజెందర్ తో చర్చలు ముగిసిన అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈసందర్భంగా జూనియర్ డాక్టర్ల చైర్మన్ జయేందర్ మాట్లాడుతూ…

మా డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది…త్వరలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు బర్తీ చేస్తామని హామి ఇచ్చారన్నారు. ఖాళీలు ఉండటంతో ఆసుపత్రులలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సమ్మె చేస్తున్న సమయంలో ఎమర్జెన్సీ కేసులను ఆపలేదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

- Advertisement -