ఈ నెల 24 నుండి నిరక్షరాస్యుల సర్వే- మేయర్

474
Bonthu Rammohan
- Advertisement -

సీఎం కేసీఆర్ పిలుపుకు అనుగుణంగా హైదరాబాద్‌ను 100% అక్షరాస్యత వున్న నగరంగా తీర్చిదిద్దెందుకు ఈ నెల 24 నుండి మార్చి 04 వరకు నిర్వహిస్తున్న సర్వేలో ఉత్సాహంగా పాల్గొని, విజయవంతం చేయాలని కార్పొరేటర్లు, శాసన సభ్యులకు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. నగరంలోని 150 వార్డులను 5,704 ఆవాస ప్రాంతాలుగా గుర్తించి, సర్వేకు బ్లాకులుగా విభజించినట్లు తెలిపారు. నగరంలో ఒక కోటి జనాభా ఉంటుందన్నారు. దాదాపు 24 లక్షల 78 వేల కుటుంబాలు నివసిస్తున్నాయని వివరించారు. ప్రతి బ్లాకుకు ఒకరు చొప్పున 8,681 మందిని ఎన్యుమరేటర్లుగా నియమించినట్లు తెలిపారు.

అలాగే ప్రతివార్డుకు ఒక సూపర్ వైజర్ ను, వార్డులోని సర్వే ప్రక్రియను మానిటరింగ్ చేయుటకు ప్రతి సర్కిల్ కు సంబంధిత యుసిడి డెప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్‌ను సర్కిల్ సూపర్ వైజర్ గాను, డీప్యూటీ మునిసిపల్ కమీషనర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. నగరంలో 40 వేల స్వయం సహాయక సంఘాలు, 13 వందల స్లమ్ లెవెల్ ఫెడరేషన్స్ వున్నాయి. నూరు శాతం గృహాలను సర్వే చేసేందుకు ఈ సంఘాలను సమాయత్తం చేశారు. ప్రతి ఇంటికి తిరిగి నిరక్షరాస్యుల వివరాల నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించుటకు ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు సర్కిల్ స్థాయిలో శిక్షణ ఇచ్చారు. సర్వే రిజిస్టర్లు, ప్రొఫార్మాలను ఎన్యుమరేటర్లకు అందజేశారు.

స్లమ్ లెవెల్ ఫెడరేషన్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లకు చెందిన రిసోర్స్ పర్సన్స్, చదువుకున్న ఆఫీస్ బేరర్స్ ను ఎన్యుమరేటర్లు గా నియమించారు. ఈ సర్వే లో రాయడం, చదవటం రాని వారి వివరాలు సేకరించడం జరుగుతుంది. నిరక్షరాస్యుల మాతృభాష వివరాలు నమోదు చేస్తారు. సర్వేతోపాటు నిరక్షరాస్యుల డేటాను 10 రోజుల్లోనే కంప్యూటరైజేషన్ చేయాలి. ఆ ఇంట్లో వున్న విద్యావంతులలోనే నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేయిస్తారు. అవసరమైతే బంధువులు, ఇంటి పక్క నుండే వారి సహకారం తీసుకుంటారు. స్వల్పకాలంలోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించుటకు అవసమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. నిరక్షరాస్యుల సర్వే ప్రక్రియలో పాల్గొని, ఎన్యుమరేటర్లకు సహకరించాలని కార్పొరేటర్లను కోరారు.

- Advertisement -