మెగాస్టార్‌కు జోడీగా మహేష్‌ హీరోయిన్‌..!

310
chiru

బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటు మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో వెండితెర రీ ఎంట్రీ ఇచ్చిన సూపర్‌ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరు 151 చిత్రం సైరా నరసింహారెడ్డితో బిజీగా ఉన్నారు. అక్టోబ‌ర్ 2న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుద‌ల కానుంది. తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం ఇలా ప‌లు భాష‌ల‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.

Ileana D'Cruz

ఇక చిరు 152వ చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్రానికి సంబంధించి కొన్నాళ్ళుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి.ఇక, తాజాగా ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ విషయంలో ఓ వార్త బయటకు వచ్చింది.

ఇందులో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో మెరిసి టాప్ హీరోయిన్‌గా ఎదిగిన గోవా బ్యూటీ ఇలియానాను తీసుకోబోతున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. చాలా రోజుల తర్వాత తెలుగులో రవితేజ సరసన నటించింది ఇలియానా. శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ద్వారా ఇలియానా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.