‘ఐఐటీ కృష్ణమూర్తి’ ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్..

236
IIT Krishnamurthy First Look
- Advertisement -

పృద్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి ‘. కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీ వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు.. వినూత్నమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుపుకుంటుండగా, తాజాగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.. ఈ లుక్‌లో “మిస్సింగ్- లాస్ట్ సీన్ సాటర్ డే ఈవినింగ్” అనే క్యాప్షన్స్, సినిమాపై మంచి ఇంట్రెస్ట్‌ను కలిగిస్తున్నాయి. ఇంకా ఈ పోస్టర్‌లో సీరియస్ లుక్‌లో హీరో కనిపిస్తూ ప్రేక్షకులలో ఎంతో క్యూరియాసిటీ కలిగిస్తున్నారు.

IIT Krishnamurthy First Look

వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఫిబ్రవరి 24 న రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.. వేసవి కానుకగా మే 28 న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సినిమాకి నరేష్ కుమారన్ సంగీతం సమకూరుస్తుండగా, యేసు పి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.. ప్రేమ్ కుమార్ పాత్ర సమర్పిస్తున్న ఈ సినిమాని క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్నారు.

నటీనటులు : పృద్వీ దండమూడి, మైరా దోషి, వినయ్ వర్మ, భారతి ఆనంద్, బెనర్జీ, కమెడియన్ సత్య తదితరులు.. సాంకేతిక నిపుణులు : దర్శకుడు : శ్రీ వర్ధన్,సమర్పణ : ప్రేమ్ కుమార్ పాత్ర,నిర్మాత : ప్రసాద్ నేకూరి,బ్యానర్ : క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్,ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీ క్రిష్,సినిమాటోగ్రఫీ: యేసు.పి, సంగీతం: నరేష్ కుమారన్,ఎడిటర్ : అనిల్ కుమార్.పి,రచన : నాగార్జున మనపాక,గీత రచయిత : రామాంజనేయులు సంకర్పూ,లైన్ ప్రొడ్యూసర్ : ఎల్.వి. వాసుకి,ప్రొడక్షన్ కంట్రోలర్ : అశ్విన్ , ఆనంద్ కుమార్,క్యాస్టింగ్ : సూర్య తేజ,కలరిస్ట్ : శ్రీనివాస్ మామిడి, పి.ఆర్.ఓ : సాయి సతీష్.

- Advertisement -