రాయుడు మా దేశంలో ఆడు..ఐస్ లాండ్ బంపర్ ఆఫర్

353
Ambati Raydu
- Advertisement -

అంబటి రాయుడుకి వరల్డ్ కప్ లో ఆడాలనే కళ కళగానే మిగిలింది. కొన్ని కారణాల వల్ల అతన్ని పక్కకు పెట్టేశారు సెలక్టర్లు. ఇటివలే విజయ్ శంకర్ గాయం కారణంగా వరల్డ్ కప్ దూరమవ్వగా అతని స్ధానంలో మయాంక్ అగర్వాల్ ను తీసుకున్నారు. ఈసందర్భంగా రాయుడుకి ఐస్ లాండ్ దేశ క్రికెట్ బోర్డు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మా దేశానికి వచ్చెయ్..ఇక్కడే ఉండిపో అంటూ లేఖ రాసింది.

రాయుడు నువ్వు అంటే మాకు ఎంతో అభిమానం..ఇప్పుడైనా త్రిడి గ్లాసులు పక్కన పెట్టు..మాములు అద్దాలతో ఈ డాక్యుమెంట్లు చూడు.. ఐల్యాండ్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్ల వివరాలను కూడా దానికి జత చేసింది. ఐస్ లాండ్ ఇచ్చిన ఈ ఆఫర్ పై రాయుడు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి మరి.

- Advertisement -