విండిస్ పై శ్రీలంక విజయం

314
srilanka Win
- Advertisement -

ఐసీపీ ప్రపంచకప్ లో భాగంగా నిన్న వెస్టిండీస్ శ్రీలంకల మధ్య మ్యాచ్ జరిగింది. ఈమ్యాచ్ లో వెస్టిండిస్ పై 23పరుగలు తేడాతో శ్రీలంక విజయం సాధించింది. ఇప్పటికే సెమిస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత 50ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 338పరుగులు చేసింది. విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 315 పరుగులు మాత్రమే చేసి విజయం ముందు బోల్తా పడింది. నికోలస్ పూరన్ (118) సెంచరీతో చెలరేగినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.

ఫాబియన్ అలెన్ 51, గేల్ 35 పరుగులు చేశారు. ఈ ప్రపంచకప్‌లో విండీస్‌కు ఇది ఆరో ఓటమి… ఎనిమిది మ్యాచ్‌ల్లో లంక జట్టుకు ఇది మూడో విజయం. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఆటగాళ్లలో అవిష్క ఫెర్నాండో 104, కుశాల్‌ పెరీరా 64, కరుణరత్నె 32, కుశాల్‌ మెండిస్‌ 39, తిరిమానె 45 (నాటౌట్‌) పరుగులతో రాణించడంతో భారీ స్కోర్ చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు గేల్‌ 35, హెట్‌మయర్‌ 29, అలెన్‌ 51 పరుగులు చేయగా… 118 పరుగులతో ఒంటరిపోరాటం చేసిన పూరన్‌.. తమ జట్టును గెలిపించుకోలేకపోయాడు.

- Advertisement -