పాకిస్ధాన్ పై ఇండియా ఘన విజయం…వరుసగా 7సారి

136
India

ప్రపంచకప్ లో భాగంగా నిన్న లండన్ లోని మాంచెస్టర్ స్టేడియంలో జరిగిన పాకిస్ధాన్ ఇండియా మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. 89 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఇండియా బ్యాంటింగ్ ముగిసిన తర్వాత వర్షం పడటంతో పాకిస్ధాన్ బ్యాటింగ్ ను 40ఓవర్ల వరకే కుదించారు. ధీంతో డక్ వర్త్ లూయీస్ ప్రకారం పాకిస్థాన్ టార్గెట్ 40 ఓవర్లలో 302 పరుగులు చేయాల్సి ఉండగా..పాకిస్థాన్ నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు మాత్రమే చేయగలిగింది.

రోహిత్ శర్మ 113బంతుల్లో 140పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 57పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక కోహ్లి 65బంతుల్లో 77పరుగులు చేశాడు. పాక్‌ 6 వికెట్లకు 212 పరుగులకే పరిమితమైంది కుల్‌దీప్‌ యాదవ్‌, విజయ్‌ శంకర్‌ , హార్దిక్‌ పాండ్య చెరో 2 వికెట్లు తీశారు. రోహితే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కిది వరుసగా మూడో విజయం.

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే. శనివారం భారత్‌.. అఫ్గానిస్థాన్‌ తో తలపడనుంది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్ధాన్ పై ఇండియా గెలవడంతో దేశ వ్యాప్తంగా అర్ధరాత్రి సంబరాలు చేసుకున్నారు. బ్యాండ్‌ బజాయిస్తూ బాణాసంచా కాల్చుతూ హంగామా చేశారు. జాతీయ జెండాలను చేతుల్లో పట్టుకుని భారత్‌మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.