టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీంఇండియా

419
India vs Afganistan
- Advertisement -

వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఆష్గనిస్తాన్ తో టీంఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసే జట్లక పిచ్ అనుకూలిస్తున్న నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఆలోచనకు తావులేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. కాగా, టీమిండియాలో ఓ మార్పు చోటుచేసుకుంది. గాయంతో బాధపడుతున్న కొత్తబంతి బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో మహ్మద్ షమి బరిలో దిగుతున్నాడు. జరిగిన 4 మ్యాచ్ ల్లో మూడింటిలో విజయం సాధించిన భారత జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

భారత జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్, ధోనీ, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్, షమీ, చాహల్, బుమ్రా

అఫ్గనిస్థాన్: హజ్రతుల్లా జజాయ్, గుల్బదిన్ నైబ్, రహ్మత్ షా, షాహిదీ, అస్గర్ అఫ్గాన్, ఇక్రమ్ అలీ ఖిల్, జద్రాన్, రషీద్ ఖాన్, అఫ్తాబ్ ఆలం, మహ్మద్ నబీ, ముజీబ్ రెహ్మాన్

- Advertisement -