పాక్ ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా

81
australia

వరల్డ్ కప్ లో భాగంగా నిన్న ఆస్ట్రేలియా చేతితో పాకిస్ధాన్ ఘోరంగా ఓడిపోయింది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 266 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్(107: 111 బంతుల్లో 11ఫోర్లు, సిక్స్) సెంచరీతో విజృంభించడంతో 49 ఓవర్లలో 307 పరుగులు చేసి ఆలౌటైంది.

ఓపెనర్ ఆరోన్ ఫించ్(82; 84 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లు) రాణించడంతో ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది. గ్లెన్ మాక్స్‌వెల్(20), షాన్ మార్ష్(23), అలెక్స్ కేరీ(20) చెప్పుకోదగ్గస్థాయిలో ప్రదర్శన చేయలేదు. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమీర్(5/30) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. షహీన్ అఫ్రీదీ(2/70) రెండు వికెట్లు తీయగా హసన్ అలీ, వాహబ్ రియాజ్, హఫీజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.