టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా..!

89
t20

క‌రోనా ఎఫెక్ట్‌తో ఇప్ప‌టికే ప‌లు అంత‌ర్జాతీయ స్పోర్ట్స్ టోర్న‌మెంట్స్ వాయిదా ప‌డ‌గా తాజాగా టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కూడా వాయిదా ప‌డింది. ఈ మేర‌కు ఐసీసీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

షెడ్యూల్ ప్ర‌కారం ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా ఒక టీ20 ప్రపంచకప్.. వచ్చే ఏడాది భారత్ వేదికగా మరో టీ20 వరల్డ్‌కప్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే తాజాగా అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఈ రెండు టోర్నీలు ఒక ఏడాది వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

టీ20 వరల్డ్‌కప్ వాయిదా విషయమై ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో చర్చిస్తోంది ఐసీసీ. ఒకవేళ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాకి టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కుల్ని ఇస్తే.. ఆ తర్వాత 2022లో భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించకోచ్చని ప్రతిపాదించే అవకాశం ఉంది. మ‌రి ఈ ప్ర‌తిపాద‌న‌ను బీసీసీఐ ఒప్పుకుంటుందా లేదా చూడాలి.