అటవి శాఖ అధికారిపై దాడిని ఖండిస్తున్నాః కేటీఆర్

355
Ktr Forest Officer
- Advertisement -

అసిఫాబాద్ జిల్లాలోని సార్ సాలాలో అటవీ శాఖాధికారిణి అనితపై ఎమ్మెల్యే కోనేరు కొనప్ప సోదరుడు జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈఘటనపై స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు చేసిన పనిపై విచారణ వ్యక్తం చేస్తున్నానని అన్నారు.

విధుల్లో ఉన్న ఉద్యోగులపై దాడి చేయడం సబబు కాదని చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఆయనపై ఇప్పటికే కేసు నమోదైందని, ఆయన్ని అరెస్టు చేశారని చెప్పారు. ఇప్పటికే కోనేరు కృష్ణారావుతో పాటు మరో 11మంది ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. నిందితులపై హత్యాయత్నం, వాహనాల ధ్వంసం కింద కేసులు నమోదు చేశారు.

- Advertisement -