రిటైర్మెంట్ ఎప్పుడో నాకే తెలియదు:ధోని

172
ms dhoni

ప్రపంచకప్‌లో ధోని పేలవ ఫామ్‌తో ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్‌పై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి.దీంతో వాటిపై స్పందించారు ధోని.

తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు మహి. తానూ ఎప్పుడు రిటైర్మెంట్ అవుతానో తనకే తెలియదని అన్నాడు.కొందరు అభిమానులు మాత్రం శ్రీలంక మ్యాచ్ తర్వాత తను రిటైర్మెంట్ అయితే బాగుంటుందని కోరుకుంటున్నారని అన్నాడు .

ప్రపంచ కప్ తర్వాత కూడా ధోని జట్టులో కొనసాగుతాడని బీసీసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కెప్టెన్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రి, ఆటగాళ్లు సైతం ధోని కొనసాగాలనే భావిస్తున్నారని వెల్లడించారు.