కొత్తగా వచ్చిన కోన కారు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే చాలు..!

396
- Advertisement -

ప్రపంచ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ కోన పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. దీన్ని తాజాగా భారత మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు. కోన విద్యుత్‌తో నడిచే ఎస్ యూవీ. భారత్‌లో ఎలక్ట్రిసిటీతో నడిచే తొలి ఎస్ యూవీ ఇదే. కంఫర్ట్, ఎకో, స్పోర్ట్ మోడళ్లలో ఇది లభ్యమవుతుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.25.30 లక్షలు. సాధారణ కారు మాదిరిగానే కనిపిస్తున్న ఈ ‘కోన’లో ఫ్రంట్ గ్రిల్, ఎక్స్‌హాస్ట్ వంటివి వుండవు.

ఒకసారి ఛార్జ్‌ చేస్తే 557కి.మీ..‘కోన’లో 100 కిలో వాట్ల మోటార్‌ అమర్చారు. ఇది ముందు చక్రాలకు 395 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 131బీహెచ్‌పీ శక్తిని అందిస్తుంది. ఇది ఏకధాటికి 345 కి.మీ. ప్రయాణిస్తుంది. కోన మరో మోడల్‌ 150 కిలోవాట్ల మోటార్‌ను అమర్చారు. ఇది 395ఎన్‌ఎం టార్క్‌ వద్ద 200 బీహెచ్‌పీ శక్తిని అందిస్తుంది. ఏకధాటిగా 557 కి.మీ. ప్రయాణిస్తుంది. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 9.7 క్షణాల్లోనే అందుకుంటుంది. ఒక సాధారణ ఎస్‌యూవీ కంటే ఇది చాలా ఎక్కువ వేగం. ఈ కారు మొత్తం ఎకో, కంఫర్ట్‌, స్పోర్ట్‌ అనే డ్రైవింగ్‌ మోడ్స్‌లో లభిస్తుంది.

Hyundai Kona Electric Car

కారులోపల 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ను అమర్చారు. దీనికి స్మార్ట్‌ఫోన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. ఈ కారులో యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో కనెక్టివిటీ ఆప్షన్లను ఇచ్చారు. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, వెంటిలేటెడ్‌ సీట్స్‌, హెడ్‌అప్‌ డిస్‌ప్లే ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, బై ఫంక్షన్‌ ఎల్‌ఈడీ ల్యాంప్‌లు, డిజిటల్‌ ఇన్‌స్ట్రమెంట్‌ కన్సోల్‌, 10రకాలుగా డ్రైవర్‌సీట్‌ను మార్చుకునే ఆప్షన్‌ను అందుబాటులో ఉంచారు. ఎలక్ట్రిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, ఏబీఎస్‌, ఈబీడీ, ఈఎస్‌సీ, వీఎస్‌ఎం, హెచ్‌ఏసీ, అన్ని చక్రాలకు డిస్క్‌ బ్రేక్‌, వర్చువల్‌ ఇంజిన్‌ సౌండ్‌ సిస్టమ్‌ ఉన్నాయి.

దీని కోసం కంపెనీయే తన ఔట్‌లెట్స్ వద్ద చార్జింగ్ పోర్ట్‌లను ఏర్పాటు చేస్తుంది. అలాగే కారుతోపాటు చార్జర్ కూడా ఇస్తుంది. అంతేకాకుండా పెట్రోల్ బంకుల్లో కూడా చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తుంది. కారుపై 3 ఏళ్ల వారంటీ ఉంటుంది. బ్యాటరీకి 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ వస్తుంది.

- Advertisement -