అగ్రస్థానంలో హైదరాబాద్..

286
Hyd

హైదరాబాద్ నగరం ప్రపంచ క్రియాశీల నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నప్పటికీ సామాజిక-ఆర్థిక, వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్‌ ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల నగరం (డైనమిక్‌ సిటీ)గా అవతరించింది.

బెంగళూరును అధిగమించిన భాగ్యనగరం విశిష్ట ఘనత అందుకుంది. 2020కి గాను మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ నిలిచిందని ఓ స్థిరాస్తి అధ్యయన సంస్థ వెల్లడించింది. ఈ మేరకు సిటీ మూమెంటం ఇండెక్స్-2020ని తెలంగాణ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.

ktr

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత మూడేళ్ళలో హైదరాబాద్ రెండు సార్లు నెంబర్ వన్ ప్లేస్ లో ఉండటం సంతోషంగా ఉంది. టాప్ ప్లేస్ లో నిలవడానికి కారణం మన హైదరాబాద్ కి ఎయిర్ కనెక్టవిటీ బాగుంది. టాప్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉన్నాయి.హైదరాబాద్ ని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.

టాప్ 20 లో నిలిచిన ఏడు ఇండియన్ పట్టణాలు ఇవే..

హైద్రాబాద్‌ – 1వ స్థానం
బెంగుళూరు – 2వ స్థానం
చెన్నై -3వ స్థానం
ఢిల్లీ – 6వ స్థానం
పూణె – 12వ స్థానం
కోల్‌కత్త – 16వ స్థానం
ముంబై – 20వ స్థానంలో నిలిచింది.