హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సదస్సు

68
e vehicles

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సదస్సు  ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యుకే,బొలివియా పరిశ్రమల ప్రతినిధులతో పాటు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీ వర్క్స్‌ సీఈవో సుజయ్ కరంపురి మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాలు రాష్ట్రంలోని ప్రజలకు ఎలా అలవాటు చెయాలన్నది సదస్సులో చర్చించామని తెలిపారు.

ప్రస్తుతం పెట్రోల్ వాహనాలనే వాడుతున్నాం…సెల్ ఫోన్ తరహాలోనే త్వరలోనే ప్రతిఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు వాడతారం టూ, త్రీ, ఫోర్ వీలర్స్ కోసం ప్రభుత్వం సబ్సీడీలు ఇస్తుందని తెలిపారు.బ్యాటరి తయారీ కంపెనీలు తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నామని విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం లో కొదవ లేదు కాబట్టి విద్యుత్ వాహనాలను ఇక్కడ పెట్టేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మూడు బ్యాటరీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీల ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. 900ఎకరాలతో ఎలక్ట్రిక్ పార్క్ .. 200ఈవీ పార్క్ ఏర్పాటు

కంపెనీల రాకను బట్టి పార్క్ ను 2000ఎకరాలకు పెంచబోతున్నామని చెప్పారు.ప్రభుత్వం సబ్సిడీ పై భూములు ఇచ్చింది పైలెట్ ప్రాజెక్ట్ కింద నడుపుతున్న ఆర్టీసీ బస్ లు మంచి ఫలితాలు వచ్చాయి రానున్న రోజుల్లో మరిన్ని విద్యుత్ వాహనాలను పెంచుతాం మన్నారు.

మహేశ్వరంలో ఈ-సిటీ ఏర్పాటు చేయబోతున్నాం…10 కిలో వాట్ల విధ్యుత్ నిల్వ బ్యాటరీలు తయారు చేస్తాం ..ఈ-రిక్షా, టూ వీలర్, ఫోర్ వీలర్స్ కూ రాయితీలు ఇస్తాం మని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ పెట్టుబడులు 6 వేల కోట్లకు పెరుగనున్నాయని చెప్పారు.

లిథియం సరఫరా కోసం ఒప్పందం చేసుకున్నామని బొలివిమా అంబాపిడర్‌ జే.జే.కర్టేజ్ తెలిపారు. ఉత్పత్తి కంటే నిల్వ ముఖ్యమని..లిథియం ఒక్కటే విద్యుత్‌ను ఎక్కువ సమయం నిల్వ ఉంచ గలుగుతుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నాం….నీతీఆయోగ్ ప్రకారం కొన్ని కంపెనీలు అక్కడికి వచ్చి మైనింగ్ చేసుకోవచ్చు…అక్కడి కంపెనీలు భారత్ కు వచ్చి ఉత్పత్తులు అమ్మవచ్చు…చైనా, జర్మనీలకు లిథియం ఎక్కువగా వెళ్తుందన్నారు.

భారత్ కో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని బ్రిటన్ హైకమిషనర్‌ విలియమ్ హకిన్సన్‌ తెలిపారు.ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల కాలుష్యం తగ్గుతుంది.రాబోయే రోజుల్లో భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలు పెరగబోతున్నాయని చెప్పారు.