నేడే హైటెక్‌సిటీ-రాయదుర్గం మెట్రో ప్రారంభం

501
hmr
- Advertisement -

ఐటీ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్‌సిటీ -రాయదుర్గం మెట్రో మార్గం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం మెట్రోను ఇవాళ ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్‌. మైండ్ స్పెస్ జంక్షన్ వరకు రైలు అందుబాటులోకి రావడం ద్వారా ఇనార్బీట్ మాల్ మార్గంలో ఐటి కంపనీలకు…. గచ్చిబౌలి జంక్షన్ లో వరకు ఉన్నా ఐటి కంపనీల ఉద్యోగులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది.

ఈ 1.5 కి.మీ. ఈ మార్గాన్ని ఉదయం 10.15 గంటలకు హైటెక్‌సిటీలో ప్రారంభించి అక్కడినుంచి రాయదుర్గం వరకు మెట్రోలో అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణిస్తారు.ఈ మార్గంతో మెట్రోకు అదనంగా 40 వేలమంది ప్రయాణికులు పెరుగుతారని మెట్రోరైలు అధికారులు తెలిపారు.

కారిడార్ -3 మార్గంలో భాగంగా ఇప్పటికే నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు రాకపోకలు సాగిస్తుండగా ఈ మార్గం అందుబాటులోకి రావడంతో కారిడార్ త్రీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు అయింది.

The much-awaited Mindspace Metro station near the Mindspace junction has been inagurated by ktr today. Hyderabad Metro services to Mindspace junction starts today

- Advertisement -