మెట్రోను ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు..

526
metro md
- Advertisement -

ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల హైదరాబాద్‌లో మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఆర్టీసీ బస్సులు లేక పోవడంతో ప్రయానికులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. రెండు కారిడార్లలో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రో అదనపు సర్వీసులు నడుపుతోంది. ఈ నేపథ్యంలో మియాపూర్ స్టేషన్‌లో మెట్రో ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి రద్దీని పరిశీలించారు.

ఈ సందర్భంగా మెట్రో ఎండి ఎన్ వి ఎస్ రెడ్డి ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రోల్లో ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. సాధారణ రోజుల్లో మూడు లక్షల మంది మెట్రో రైల్లో ప్రయాణిస్తుండగా ప్రస్తుతం మూడు లక్షల 50 వేల మంది ప్రయాణిస్తున్నారు. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్ మెట్రోను ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని మెట్రో ఎండి తెలిపారు.

- Advertisement -