హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు..

424
hmr
- Advertisement -

భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే హైదరాబాద్‌ మెట్రోకు విశేష స్పందన వస్తోంది. రోజురోజుకి ప్రయాణీకుల సంఖ్య పెరిగిపోతుండగా మెట్రో సర్వీసులను రెట్టింపు చేసింది. ప్రస్తుతం ప్రతి 15 నిమిషాలకో మెట్రో సర్వీస్ నడుస్తుండగా ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనతో పీక్ హవర్స్ లో ప్రతి 5 నిమిషాలకు ట్రైన్ అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇక హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు 14న ఒకే రోజు 3.06 లక్షల మంది ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హెచ్‌ఎంఆర్‌ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి చాలా మంది ప్రయాణికులు ఈ సేవను ఉపయోగిస్తుండడంతో కొత్త రికార్డు సృష్టించామని తెలిపారు.

రాయదుర్గ్ (మైండ్‌స్పేస్ Jn. స్టేషన్) వరకు పనులు కూడా పూర్తయ్యాయని చెప్పారు. హిటెక్ సిటీ, రాయదు ర్గ్ స్టేషన్ల మధ్యలో ట్రయల్ రన్‌ త్వరలో ప్రారంభం అవుతుందని హెచ్‌ఎంఆర్ ప్రాజెక్ట్ ఇప్పటికే 75 కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుందని తెలిపారు.

హిటెక్ సిటీ రివర్సల్ పనులు పూర్తయ్యాయని … భద్రతా అనుమతులు వచ్చిన కొద్ది రోజుల్లో జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్, హైటెక్ సిటీ మధ్య సాధారణ రైలు సేవలను ప్రారంభిస్తామని చెప్పారు.

- Advertisement -