తెలంగాణ పోలీసులు గ్రేట్‌ అంటున్న రౌడీ బేబి..!

525
Actress Sai Pallavi
- Advertisement -

తెలంగాణ పోలీసులు గ్రేట్‌ అంటూ హీరోయిన్‌ సాయిపల్లవి ప్రశంసలు కురిపించింది. హెచ్ఐసీసీలో షీ ఎంపవర్ ఉమెన్స్ కాంక్లేవ్ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సులో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, ఐజీ స్వాతిలక్రా, టెస్సీ థామస్‌, సినీనటి సాయిపల్లవితో పాటు పలువురు పాల్గొన్నారు. మహిళల భద్రత, ఇతర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌ పరిధిలోని మహిళా ఉద్యోగుల భద్రత కోసం రూపొందించిన ‘షీ సేఫ్‌’ అనే ప్రత్యేక యాప్‌ను సాయిపల్లవి ప్రారంభించారు.

saipallavi

ఈ కార్యక్రమంలో సాయిపల్లవి మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం టీఎస్ పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు చాలా గ్రేట్ అని.. మన దేశంలో మహిళలకు హైదరాబాదులో ఉన్నంత భద్రత మరెక్కడా లేదని ఆమె తెలిపింది. ఒక్కప్పుడు చదువు, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చే యువతులు చాలా భయపడేవారని… ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని సాయిపల్లవి చెప్పింది. పోలీసులకు కూడా యువత సహకరించాలని… అది మన బాధ్యత అని తెలిపింది.

- Advertisement -