ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి

128
anjani

వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు హైదరాబాద్ నగర్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు సేఫ్టీ వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గోన్నారు. లారీ, ఆటో, బస్, టూ, త్రీ విల్లర్ వాహనాల డ్రైవర్స్ కు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు ప్రమాదాల పై అవగాహన కార్యక్రమం చేపట్టారు.

ఈసందర్భంగా సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. నగరంలో ట్రాఫిక్ వింగ్ కి చాలా ప్రాముఖ్యత వుంది. నగర భద్రతతో పాటు రోడ్డు ప్రమాదం రహితంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. వాహనం నడిపేటప్పుడు ప్రతి వహనదారుడు అందరి గురించి ఆలోచించాలన్నారు. పోలీసులకు డ్రైవర్లు సహకరించండి, వాహనం నడిపేటప్పుడు కచ్చితంగా సేఫ్టీ, సెక్యూరిటీ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. పోలీసులు సైతం తమ వాహనాలు నడిపే వారు కూడా ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలి. గతంలో కంటే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 3 శాతం తగ్గాయన్నారు.