హుజూర్ నగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల

183
Uttam Vs SaidiReddy

సూర్యపేట జిల్లా హుజూర్నగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ను రిటర్నింగ్ అధికారి చంద్రయ్య సోమవారం విడుదల చేశారు. నేటి నుండి నామినేషన్ స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. రిటర్నింగ్ కార్యాలయం 100 మీటర్ల పరిధిలో నిషేధ ఆంక్షలు విధించినట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

అక్టోబర్ 21న జరగనున్న పోలింగ్ నేటి నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న చివరితేదీ కాగా, అక్టోబర్ 1 నామినేషన్ల పరిశీలన 3న ఉపసంహరణ కు అన్ని ఏర్పాటు చేశారు. నేటి నుండి స్వీకరించనున్న నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్వో తెలిపారు.

రిటర్నింగ్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ కార్యాలయం 100 మీటర్ల పరిధిలో నిషేదాక్షాలు కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలు దాఖలకు వన్ ప్లస్ ఫోర్ సభ్యులను మాత్రమే అనుమతించినట్లు ఆర్వో పేర్కొన్నారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను తొలగించి దివంగత నాయకుల విగ్రహాలకు ముసుగు కప్పారు. ఫ్లయింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేసి ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించ నున్నట్లు ఆర్వో తెలిపారు.