షాకింగ్.. అమ్మాయి కడుపులో జుట్టు..!

272

తమిళనాడులోని వైద్యులు ఓ బాలిక కడుపులో నుంచి అరకిలో వెంట్రుకలు, షాంపూ సాచెట్లు తొలగించారు. డాక్టర్‌ గోకుల్‌ కృపాశంకర్‌ నేతృత్వంలో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్సచేసి వెంట్రుకలు, ఖాళీ షాంపూ సాచెట్లు వెలికితీశారు. ఇందంతా చూసి వైద్యులు షాక్‌కి గురైయ్యారు. అమ్మాయి కడుపులో జుట్టు ఏంటని ఆశ్చర్యపోకండి ఇది నిజం. ఇది వింటే మీరూ షాక్‌ తినాల్సిందే.

human hair in girl stomach

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కోయంబత్తూరు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక ప్రతిరోజూ కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో పేరెంట్స్ దగ్గర్లోని వీజీఎమ్ ఆస్పత్రకి తరలించారు. అయితే స్కాన్ చేసిన డాక్టర్స్ లోపల ఏదో నల్లటి పదార్ధం కడుపులో ఉందని గుర్తించారు..కానీ అదేంటన్నది అర్ధం కాలేదు. వెంటే ఆపరేషన్ చేయగా..బాలిక కడుపలో అరకేజీ జుట్టు దర్శనమిచ్చింది.

జుట్టు మాత్రమే కాదు షాంపూ పాకెట్లు, ఇంకొన్ని ప్లాస్టిక్ వస్తువులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని తొలగించిన వైద్యులు..ఆమెకు బెడ్ రెస్ట్ సజిస్ట్ చేశారు. దీనిపై తల్లిదండ్రులు స్పందించారు. తమ కుమార్తె మానసిక వ్యాధితో బాధపడుతోందని..అందుకే ఇలా చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.