ప్రేయసితో కోహ్లీ బర్త్‌డే వేడుక…

225
Online News Portal
How Virat Kohli celebrated his 28th birthday
- Advertisement -

టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ తన 28వ జన్మదిన వేడుకల్నిప్రేయసి అనుష్కశర్మతో కలిసి జరుపుకొన్నాడు. రాజ్‌కోట్‌లోని ఇంపీరియల్‌ హోటల్‌లో జరిగిన ఈ వేడుకల్లో భారత జట్టు సభ్యులు పాల్గొన్నారు. నవంబర్‌ 9న ఇంగ్లాండ్‌తో తొలిటెస్ట్‌ సందర్భంగా విరాట్‌సేన రాజ్‌కోట్‌ చేరుకొంది.బర్త్‌డే సందర్భంగా విరాట్‌కు తాజా, మాజీ ఆటగాళ్లు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

కోహ్లీ ఎప్పుడూ ఇదే విధంగా ఆడాలని సచిన్ ట్వీట్ చేయగా, వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి నవ్వుల పంచ్‌లు విసిరాడు. హజ్మీ గోలీ, రంగుల హోలీ, గుజరాత్‌లో గాగ్రా చోలీ, ఇక బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ.. ఇండియాలో అందరికీ ఇష్టం అని ప్రాస కలిపాడు. 8 ఏండ్ల కిందట చీకూ (సపోటా) తింటూ విరాట్ పుట్టిన రోజు జరుపుకునేవాళ్లమని, కానీ ఇప్పుడు ఆటో ట్యాక్సీలు మీటర్లను 100 నుంచి ప్రారంభిస్తున్నాయని సెంచరీలపై కామెంట్ విసిరాడు సెహ్వాగ్‌.

anushka1

టీమిండియా ఆటగాళ్లు గౌతమ్‌ గంభీర్‌, ఇషాంత్‌ శర్మ, జయంత్‌ యాదవ్‌, అమిత్‌ మిశ్రా, ఛతేశ్వర్‌ పుజారా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్య కోహ్లీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కోహ్లీ పుట్టిన రోజు సందర్భంగా చాలా మంది అభిమానులు రాజ్‌కోట్‌ విమానాశ్రాయానికి కేకులు, బహుమతులు తీసుకొచ్చారు. అతడి వెంట అనుష్కశర్మ ఉండటంతో నేరుగా హోటల్‌కు చేరుకున్నాడు.

virat-kohli

- Advertisement -