ఎండాకాలం – జాగ్రత్తలు

450
season
- Advertisement -

వేసవి ప్రారంభంలో భానుడు నిప్పుల కుంపటిలా మారాడు. దీంతో ప్రజలు మధ్యాహ్నం పూట బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రానున్న రోజుల్లో మరింత ఉగ్రరూపం దాల్చనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఎండ నుంచి కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎండాకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న వచ్చు.

ఎక్కువ మంది వడదెబ్బకు గురవుతుంటారు. వడదెబ్బకు గురికాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కారం, మసాలాలు లేని వంటలు తినడం ఉత్తమం. బయటకు వెళ్లిన సందర్భంలో కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. వేపుడు పదార్థాలు, కాఫీ, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్ తాగడం మానేయాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి.

()ఇంట్లో ఉంటే కనీసం 2 లీటర్ల వరకు, బయటకు వెళితే మరో లీటరు వరకు అదనంగా మంచినీళ్లు తాగాలి. అలసటగా ఉందని అనిపిస్తే తాజా జ్యూస్ లు తీసుకోవాలి.()ఎండకాలం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు  గొడుగు, సన్ స్ర్కీన్ లోషన్స్, క్యాప్..వదులైన దుస్తులు ధరించాలి.
()ఆరు బయట, ఎండలో ఎక్కువగా శ్రమతో కూడిన పనులు చేయకుండా ఉంటే మంచిది.
()రోజులో అప్పుడప్పుడూ విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
()వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. వడదెబ్బ తగిలిన వెంటనే వైద్యుడిని సంప్రదించడి.

- Advertisement -