చలికాలంలో వీటిని తప్పక పాటించాల్సిందే..

341
- Advertisement -

చలికాలంలో సహజంగా జలుబు, ఫ్లూ మరియు శ్వాస సంబంధిత సమస్యలు చాలా సాధారణం. ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే, మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తినటం తప్పనిసరి.చలి పెరుగుతున్న కొద్దీ.. వేడిగా ఉండే ఆహారాలను తినాలని ఆరాటపడటమేకాకుండా, ఎక్కువగా తినే అవకాశం లేకపోలేదు. చలికాలంలో ఇంట్లో తినే ఆహార పదార్థాల కన్నా, బయట లభించే ఫాస్ట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్ వైపే అందరూ మొగ్గుచుపుతుంటాం. వీటి వలన అనారోగ్యానికి గురవక తప్పదు.

ఇవేకాక, బయట ఉండే చలికి బయపడి, వాకింగ్, రన్నింగ్ వంటి వాటిని చేయకపోవటమే కాక, ఎక్కువగా తిని, అధిక సమయం పాటూ, నిద్రపోతారు. ఫలితంగా భౌతిక కార్యాలకు దూరమై, ఊబకాయానికి గురవుతారు. ఊబకాయం వలన కలిగే ఇతర వ్యాధుల గురించి అందరికి తెలిసిందే.  అయితే.. ఇలాంటి ప్రమాదాలకు గురవద్దు అంటే, కింద తెలిపిన జాగ్రత్తలను తప్పక పాటించాల్సిందే.

శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచుకోండి: ఏ కాలమైన మన శరీరం హైడ్రేటేడ్ గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలము, చలికాలంలో దాహంగా లేదని చాలా మంది నీటిని తాగటమే మానేస్తారు. దీని వలన శరీరం డీ హైడ్రేషన్ కు గురవటమే కాకుండా, చర్మం పొడిగా మారుతుంది. శరీరంలో నీటి స్థాయిలు తగ్గించే జీర్ణక్రియలో సమస్యలతో పాటూ అనేక రకాల అనారోగ్యాలకు గురవవలసి వస్తుంది. కావున దాహం కాకున్నా తగిన రోజులో 6 నుండి 8 గ్లాసుల నీటిని తప్పక తాగండి.

శుభ్రత: వేసవి కాలంలో కన్నా, చలికాలంలోనే ఇన్ఫెక్షన్ లు సులువుగా వ్యాప్తి చెందుతాయి. చలికాలంలో చాలా పరిశుభ్రంగా ఉండాలి. తినే ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవటం, పండ్లు కూరగాయాలు తినే ముందు శుభ్రంగా కడగటం వంటిని మరవకూడదు.

సిట్రస్ జాతికి చెందిన పండ్లు: చలికాలంలో విటమిన్ ‘C’ మరియు జింక్ ఎక్కువగా గల ఆహర పదార్థాలను అధికంగా తినాలి. చలికాలంలో ఇన్ఫెక్షన్ సంక్రమణ అధికంగా ఉంటుంది కావున సిట్రస్ జాతికి చెందిన పండ్లు, వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరిగి, వ్యాధులకు దూరంగా ఉంటారు.

వ్యాయామాలు: చలికాలంలో వ్యాయామాలను తప్పని సరిగా చేయాలి. వ్యాయామాలను చేయటం వలన శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగి, వెచ్చగా ఉంటుంది. వ్యాయామాల వలన జీవక్రియ రేటు పెరగటమే కాకుండా, రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.

పండ్లు మరియు కూరగాయలు: చలికాలంలో వేడిగా ఉండే ఆహారాలతో పాటూ, క్రమంగా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందించటమే కాకుండా, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

Also Read:టాలీవుడ్ చంద్రమోహన్ ను అవమానించిందా?

- Advertisement -