నల్లధనాన్ని చలామణిలోకి తేవడం ఎలా?

223
How To Launder Black money
How To Launder Black money
- Advertisement -

మంగళవారం నాడు ప్రధాని మోడీ నల్లధనం వెలికేతీసేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలిసిన విషయమే. ప్రధాని ప్రకటన తరువాత ఏటీఎం సెంటర్లో తమ డబ్బుని వేసుకునేందుకు జనాలు పెద్ద లైన్లు కట్టారు. కొందరైతే తమ దగ్గరున్న అక్రమ డబ్బుని ఎలా తెల్ల డబ్బుగా మార్చుకోవాలని గూగుల్‌లో వెతికారట. ఆ రోజు నుండి భారత్‌లో గూగుల్ ట్రెండింగ్ ఎలా ఉందో ఓ ఇంటర్నెట్ ట్రెండింగ్ రిపోర్ట్‌ వెల్లడించింది.

మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగానే గూగుల్ అత్యధికులు వెతికింది… నల్లధనాన్ని చలామణిలోకి తేవడం ఎలా? అని ఎక్కువగా వెతికారట. మంగళవారం రాత్రి మోదీ నిర్ణయం తర్వాత గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌లో ఇదే ట్రెండింగ్‌ ప్రశ్నట. అయితే ఈ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉన్న రాష్ట్రం.. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌ కావడం విశేషం. ఇక ఈ లిస్ట్‌లో మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్, డిల్లీ ఇతర రాష్ట్రాలున్నాయట. భారత్‌లోని అన్ని చోట్లా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త నోట్ల గురించి, వాటిలో సెక్యూరిటీ ఫీచర్ల గురించి వెతకడం ఆ తరువాత ట్రెండింగ్‌లో ఉన్నాయట.

పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో తెలిసిన విషయమే. నేడు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నీ చేపల మార్కెట్లను తలపించాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే పాత కరెన్సీ చెల్లుబాటు కాకపోవడంతో.. ప్రజలు తమ కరెన్సీని మార్చుకునేందుకు బ్యాంకుల్లో పడిగాపులు గాస్తున్నారు. కొందరైతే రెండు వేల నోటు చేతిలో రాగానే సెల్ఫీలు తీసుకొని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోడీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. దీని ఫలితం త్వరలోనే ప్రజలకు తెలుస్తదంటూ విశ్లేషకులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల నిజాయతీగా ఉండే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, నిజాయతీగా లేనివారికే ఇబ్బందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.

- Advertisement -